7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు:
Website An Overview:
కీ.శే. ప్రభావతి మరియు కీ.శే. మహాకాళి వెంకటరావు దంపతులకు జన్మించారు రాజ్యశ్రీ. విలువలతో కూడిన జీవితం, ఆత్మీయత, మమతా నురాగాలు, కలగలిపిన బాల్యాన్ని చవిచూశారు.
రాజ్యశ్రీ సాంస్కృతిక, సాహిత్యాల మీద మక్కువతో ప్రవృత్తి రీత్యా కవితా సేద్యం చేస్తూ, రచనా వ్యాసాంగాన్ని అసిధారావ్రతంగా స్వీకరించారు. వ్యంజకాలు అనే కొత్త ప్రక్రియలో కూడా పుస్తకాలు రచించిన తొలి మహిళా రచయిత్రిగా కీర్తిగడించారు.
``భారత్ భాషా భూషణ్”, ''సాహిత్య శ్రీ'', ''ప్రజ్ఞాశ్రీ'', “వేదాంత వక్త” వంటి బిరుదులు, అనేకానేక సంస్థల సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు.
2014 సెప్టెంబర్ 27, 28 వ తేదీలలో వంగూరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ వారు సంయుక్తంగా లండన్ లో నిర్వహిస్తున్న నాల్గవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు డా|| కేతవరపు రాజ్యశ్రీ ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.