ఆధ్యాత్మికం


ధార్మిక జీవనమే ఆధ్యాత్మికత అంటూ మన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా ప్రతిఫలాక్ష లేకుండా నిర్వహించడమే అసలైన తప్పస్సు అనీ, అసూయ, అహంకారాలను వదిలిపెట్టి సాత్విక జీవనం గడపడం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చంటూ శ్రీమతి రాజ్యశ్రీ రచించిన ఆధ్యాత్మిక రచనలు పాఠకుల ప్రసంసలందుకున్నాయి.

 

ఆధ్యాత్మికం పాటించడమంటే అదేదో గొప్ప విషయంగా సమాజంలో ప్రత్యేక స్థానం పొందినట్లు గర్వపడుతూ అన్నీ తమకే తెలుసునని అనుకుంటూ వాస్తవాలకి దూరంగా ఉండే వారికి రాజ్యశ్రీ రచనలు ఆధ్యాత్మిక గుళికలుగా ఉపయోగపడతాయి.

 

కేతవరపు రాజ్యశ్రీ దైవభక్తి కలిగి, మానవీయ విలువల పట్ల గాఢనమ్మకంతో తన రచనల్లో షిర్డీసాయి బోధనలనూ, పురణాలలోని చిన్న కథలను, దత్తాత్రేయ చరిత్రనూ, రమణ మహర్షి వంటి మహాత్ముల చరిత్రలలోని సంఘటనలనూ ఆధారం చేసుకుని వాటిని వ్యాసాలలో పొందిపరుస్తూ సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా వివరిస్తుంటారు.


కర్తవ్య నిర్వహణ, పవిత్రత, ప్రణాళికాబద్ధం, మౌనం, చింతన, నివేదన, దానం, మనోబలం, నిష్కల్మషం, జీవన సాఫల్యం, సాత్విక జీవనం, ప్రశాంతత తదితర అంశాలతో అందరినీ మెప్పించేలా రాజ్యశ్రీ ఆధ్యాత్మిక రచనలు కొనసాగుతాయి.

 

చెప్పదలచుకున్న విషయాల్ని ఎంతో స్పష్టంగా, అత్యున్నతంగా, అద్భుతంగా వ్యక్తపరచగలిగే రచనాశైలి, భావనాశక్తి ఈమె సొంతం.

 

“సాహితీ కిరణం’’ మాస పత్రికలో రాజ్యశ్రీ ఆధ్యాత్మిక రచనలు ప్రచురితమయ్యాయి.

 

“నీలోకి నువ్వు” , “ఆధ్యాత్మికత వృద్ధులకేనా” , “గీతామృతం”, వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. ఈ విధంగా రాజ్యశ్రీ ఆధ్యాత్మిక జీవితం అప్రతిహతంగా కొనసాగుతూంది.