సమాజ సేవ
సంఘమిత్ర లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో కొన్ని..
- వృద్ధాశ్రమంలోని వారికి సహాయ, సహకారాలు అందించడం
- ఆశ్రమాలలో నివసిస్తున్న వారి మనో వికాసానికి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
- నాటకం ద్వారా నేత్రదానం గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నం
- నేత్ర చికిత్సా శిబిరాల నిర్వహణ
- కుష్టు వ్యాధి నివారణా కేంద్రాలలో దుస్తులు, మందులు, వంట పాత్రలు పంపిణీ
- మానసిక చికిత్సా కేంద్రాలను సందర్శించి విరాళాలు అందజేత
- బిచ్చగాళ్ళకు చలికాలం దుప్పట్లు, రగ్గులు పంచిపెట్టడం
- సంఘమిత్ర వృద్ధుల ఆశ్రమానికి పూర్వ సంయుక్త కార్యదర్శిగా విశిష్ట సేవలు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘానికి అందించిన పలు సమాజిక సేవా కార్యక్రమాలు:
- ప్రసూతి సెలవును 4 నెలలకు పెంచడానికి కృషి చేసి విజయం సాధించారు.
- మహిళల కోసం ప్రత్యేకంగా గైనకాలజిస్టుని సచివాలయ డిస్పెన్సరీ లో ఏర్పాటు చేయడం
- స్త్రీల కోసం యోగా, మెడిటేషన్ క్లాసులు నిర్వహించడం
- ఉద్యోగినుల కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహించడం
- ‘ఆర్ధిక పురోగతిలో ఉద్యోగినుల పాత్ర’ (వర్క్ షాప్) అనే అండాల మీద సెమినార్లు నిర్వహించడం
- ఉద్యోగినుల మనోవికాసానికి ఆటల పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం.

