ప్రశంసలు
డా||మండలి బుద్ధ ప్రసాద్

భగవద్గీతను పంచమవేదంగా పరిగణిస్తారు. మానవ శరీరంలో హృదయానికి ఎంత స్థానం ఉంటుందో అంతే స్థానం మహాభారతంలో గీతకు ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుండి నమ్ముతున్న విషయమేమిటంటె సంపూర్ణ వ్యక్తిత్వం నిర్మితమవ్వాలని ఆకాంక్షిస్తారో వారు గీతను చదివితే సముచిత స్థానాన్ని పొందుతారు. మహాత్మాగాంధీ ఆ సిద్ధాంతాన్ని తమ జీవితాంతం ఆచరించారు.
కేతవరపు రాజ్యశ్రీ భగవద్గ్తీతలోని 108 శ్లోకాలను సరళ భాషలో అనువాదం చేయడానికి ఎంచుకున్నారు. సాధారణ పాఠకులకు కూడా అర్ధమయ్యేలా రూపాంతరం చేసి పద్య రచన సరళంగా ఉండేలా “గీతామృతం’ పుస్తకాన్ని రచించారు. ఆమెకు నా అభినందనలు.
డా. కె.వి. రమణాచారి, ఐ.ఏ.ఎస్.

కవయిత్రిగా, రచయిత్రిగా, కార్యకర్తగా, సెక్రటేరియట్ ఉద్యోగుల్లో సాహితీమిత్రులైన చాలామందికి తెలిసిన రాజ్యశ్రీ , తన ఎన్నెన్నో కవితల ద్వారా ఎగిరే రెక్కల్తో బావాంభర వీధిలో పాఠకులను విహరింపచేయడంలో దిట్ట. ఆమెకు నా అభినందనలు. ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలనధిరోహించాలి.
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

`అక్షరాలు పరిమితం, అవి వెదజల్లే జ్ఞానపరిమళాలు విశ్వవ్యాప్తం.' అన్న రాజ్యశ్రీ గారి మాట ఈ కవితల్లో సార్ధకమవుతున్నది. ఆమె ఊహల్లో ఉయ్యాలలూగింది, భావాల్లో పసిడి స్నానం చేసింది. అమితమైన కివితాభిరుచిని కలిగిన కేతవరపు రాజ్యశ్రీ.
ఆచార్య చెన్నప్ప, తెలుగు శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం
(గీతామృతం పుస్తకం పై ఆచార్య చెన్నప్ప గారి అభిప్రాయం)
కవయిత్రిగా, ఆధ్యాత్మిక వ్యాసకర్త్రిగా పేరు తెచ్చుకున్న డా|| కేతవరపు రాజ్యశ్రీ ‘రెక్కల్లో గీతామృతం’ అందించడం ముదావహం. కాలాన్ని బట్టి వస్తున్న ప్రక్రియల్లో ‘రెక్కలు’ ఒకటి. అధ్యాయాల వెంట వెళ్ళకుండా, అసలు విషయాన్ని మరవకుండా కొనసాగిన ఈ కవితారూపానువాదం కమనీయం! రమణీయం!
డా|| రాజ్యశ్రీ కి సూటిగా చెప్పడం తెలుసు. అంతకంటే సుకుమారంగా ఎక్కువ పాండిత్యం ఉన్న వాళ్ళు సమాసబంధురమైన రచనలు చేసి గందరగోళం సృష్టిస్తారు. అలాకాక రాజ్యశ్రీ గారు భగవద్గీతను సాకల్యంగా హృదయపూర్వకంగా ఆవాహన చేసినట్టు కనిపిస్తుంది పుస్తకం చదివినప్పుడు. ఆమెకు హార్ధిక శుభాకాంక్షలు.
డా. తిరినగరి

మంచికొండ ఠీవి, మరుమల్లియ తావి - ఈ కవితా రాజ్యశ్రీ ప్రతి కవితా ప్రజల హృదయాలలో గుబాళిస్తూనే ఉంటుంది. గద్యమైనా, పద్యమైనా హృద్యంగా రాసే శిల్పాన్ని సొంతం చేసుకున్న కవయిత్రి కేతవరపు రాజ్యశ్రీ. ఆధినిక సాహిత్య రంగంలో మంచి కవయిత్రిగా తన స్థానాన్ని పదిలపరచుకున్నారు.
శ్రీ సుధామ, కవి, విమర్శకులు

చేరా, బూరా, నారా అని పురుష సాహితీ వేత్తలు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులై ఉన్నారు. స్త్రీలలో అరుద్రగారి ధర్మపత్ని కె.రామలక్ష్మి గారిని కేరా అన్నారు. ఇప్పట్లో మరి కేరా అంటే కేతవరపు రాజ్యశ్రీ గారనీ చెప్పాలి. బ్రతుకు తీపి పెంచే మానవీయ కవిత్వం ఆమెది. కావ్యకర్తగా మరెన్నో ప్రతిభా రాజ్యశ్రీలను దక్కించికుని రచనా కేతనాలని ఆమె ఎగురవేయాలని నా ఆకాంక్ష.
యం.కె. సుగమ్ బాబు ‘రెక్కలు’ రూపశిల్పి

‘రెక్కల్లో’ గీతామృతం రాసిన డా|| కేతవరపు రాజ్యశ్రీ గారికి నా అభినందనలు. మతపరంగా ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రచారంలో ఉన్న గోతాబోధను ఆవిడ ‘రెక్కల’ ప్రక్రియలోకి ఒంచడం, గీతా సారాంసాన్ని రెక్కలుగా ఎగరేయడం నాకు మహదానందాన్ని కలిగించిన విషయం.
పుస్తకాన్ని ఆద్యంతం ఒక అసమాన్య సత్య గాంభీర్యం పరచుకునేలా రాసి విశేషాన్ని సాధించిన డా|| రాజ్యశ్రీ ఉత్తమ కవయిత్రిగా సాహితీవేత్తల ప్రశంసలను పొందుతారనడంలో సందేహం లేదు.
డా|| పోతుకూచి సాంబశివరావు, కవి కృష్ణానంద, కళాప్రపూర్ణ, సరస్వతీ సమ్మాన గ్రహీత

(ఆధ్యాత్మికత వృద్ధులకేనా! పుస్తకం పై పోతుకూచి వారి అభిప్రాయం)
ప్రముఖ రచయిత్రి కేతవరపు రాజ్యశ్రీ - ఆధ్యాత్మిక వ్యాస సంపుటిలో రామాయణ విశిష్టత, ద్రౌపది, సహనం, ఆంధ్రభాషా ప్రస్థానం, జంతువులు పక్షులు కూడా మన గురువులు, సూర్య నమస్కారాల విశిష్టత..ఇలా ఎన్నో మంచి అంశాలతో కూడిన వ్యాసాలు రచయిత్రి అందించారు. రచయిత్రి పురాతన తెలుగు సాహిత్య ధర్మ లక్షణాలు ఆకళింపు చేసుకున్న విదుషీమణిగా భావించవచ్చు. ఈమె రచన సామాన్యులకు, మాన్యులకు, విద్యార్ధులకు కూడా పఠనీయం. ఈమె విద్వత్తు అందరికీ విద్వత్తులా వెలుగు నివ్వగలదని ఆశ.
డా|| డి. మధుసూధన్, ఐ.ఎన్.టి స్పెషలిస్టు

డా. కేతవరపు రాజ్యశ్రీ గారు సాహిత్యంలో అన్ని ప్రక్రియలలోనూ చాలా ఉన్నత స్థితిని చేరుకున్నారు. గుండె చప్పుళ్ళి వింటూ ‘తృప్తీ నీవెక్కడ’ అని అన్వేషిస్తూ, ‘వెన్నెల మెట్లు’ ఎక్కుతూ రోజు రోజుకూ హిమాలయ శిఖరాలందికోవడంలో కృతకృత్యులవుతున్నారు.
డా|| పి.ఎస్. మూర్తి, ప్రముఖ కవి, రచయిత మరియు విశ్రాంత సూపరింటెండెంట్, నీలోఫర్ హాస్పటల్
(ఆధ్యాత్మికత వృద్ధులకేనా! పుస్తకం పై మూర్తి గారి అభిప్రాయం)
రాజశ్రీ కవిత్వమొక రతనాల మూట. అది ఒక రసధుని కవితలలో రాజ్యశ్రీ నవరసాలు పండించగల నేర్పరి. ఆమె గొప్ప భావుకురాలు. “కాదేదీ కవితకనర్హం” అన్నది ఆమె రచనలకు సరిగ్గా సరిపోతుంది.
ఆచార్య ఎస్.వి. రామారావు (పూర్వ) తెలుగు శాఖాధ్యక్షులు మరియు డీన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం
(గీతామృతం పుస్తకం పై రామారావు గారి అభిప్రాయం)
భారతీయ వేదాంత సారం భగవద్గీత, కర్మ-జ్ఞాన-భక్తి-ధ్యాన ధారల త్రివేణీ సంగమమైన గీత ఆచరణాత్మక తత్త్వం. గీతాతత్త్వాన్ని చాటే 108 శ్లోకాలను ఎన్నుకుని కవయిత్రి కేతవరపు రాజ్యశ్రీ గీతా మాధుర్యాన్ని పాఠకులకు చవిచూపారు. భగవద్గీతలోని ‘ధర్మామృతా’న్ని ఆస్వాదయోగ్యంగా, సరళసుందరంగా హృద్యమైన శైలిలో మలచిన రచయిత్రిని మనసారా అభినందిస్తున్నాను.
బైసా దేవదాస్ సంపాదకులు, నేటినిజం దినపత్రిక
(తృప్తీ నీవెక్కడ! పుస్తకం పై దేవదాస్ గారి అభిప్రాయం)
ఆరు పదుల్లోకి అడుగిడినా..ఆరేళ్ళ అమ్మాయిలా తలలో నాలుకలా అందరితో ఎంతో కలివిడిగా ఉంటారు కేతవరపు రాజ్యశ్రీ. ఎంతో సంస్కారంతో మాట్లాడతారామె.
ఖాళీ సమయంలో పాళీ కదిలించినట్టు కాకుండా మనసు పెట్టి మదిలో రగిలిన వాస్తవ ప్రతిబింబాలకు ప్రతిరూపాలే రాజ్యశ్రీ కవితలు.
స్వర్గీయ డా|| అక్కినేని నాగేశ్వర రావు ప్రముఖ సినీ నటులు

కేతవరపు రాజ్యశ్రీ రచించిన ‘ఊహల వసంతం’ కవితా సంపుటిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆవిష్కరించి తమ అభినందనలను, ఆశీస్సులను అందించారు.
ప్రకృతిలో జన్మించిన అన్ని జీవరాశులతో పాటు పుట్టినప్పటికీ మానవ జాతి మాత్రం ఇతర జీవులకు లేని బుద్ధిని సంతరించున్నారని, ఆ పరిణామంలోనే మాటలు, లిపి, బాష, చిత్రలేఖనం వంటివి ఏర్పడి మనకు భాగవత, భాగవతాలు ఉద్భవించాయన్నారు. సాహితీ సృజనలో రచయిత్రి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని తెలిపారు.
రాజ్యశ్రీ రచించిన రచనలు అందరికీ చదవ యోగ్యమైనవిగా ఉంటాయని, కవియిత్రిగా తన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
స్వర్గీయ శ్రీ రంగనాధ్ ప్రముఖ సినీ నటులు, రచయిత

మంచికొండ ఠీవి, మరుమల్లియ తావి - ఈ కవితా రాజ్యశ్రీ ప్రతి కవితా ప్రజల హృదయాలలో గుబాళిస్తూనే ఉంటుంది. గద్యమైనా, పద్యమైనా హృద్యంగా రాసే శిల్పాన్ని సొంతం చేసుకున్న కవయిత్రి కేతవరపు రాజ్యశ్రీ. ఆధినిక సాహిత్య రంగంలో మంచి కవయిత్రిగా తన స్థానాన్ని పదిలపరచుకున్నారు.
పద్మశ్రీ డా|| కొలకలూరి ఇనాక్, ప్రముఖ రచయిత, విమర్శకులు
వంద ప్రశ్నలు సంధించిన విశేష స్వాప్నికుడు నియోగి. ఇన్ని ప్రశ్నలు అడగాలంటే ప్రాశ్నికుడికి విశేషలోకశాస్త్ర, కావ్య అదీక్షేపణం ఉండి తీరాలి. ఇది అందరికీ సాధ్యం కాదు.
డా||అద్దేపల్లి రామ్మోహనరావు, ప్రముఖ కవి, విమర్శకులు
రచయితల గురించి, వారి రచనల గురించీ అందరికీ సమాచారం బాగా వ్యాప్తి చెందడం ముఖ్యం. ఆ లక్షంతో ఒక కొత్త మార్గానికి శ్రీకారం చుట్టాడు శ్రీ నియోగి. తాను ఎన్నుకున్న కవి పుస్తకాలన్నీ తాను ముందు చదివి వాటిలోంచి ప్రశ్నలు అడగడం, సమాధానాలు రాబట్టిన తర్వాత, ఆ ముఖాముఖీతోబాటు, తాను కూడా ఒక విస్తృత వ్యాసం, ఆ కవిని గురించి రాయడం, ఆ రెండూ కలిపి పుస్తకం వెయ్యడం, కవిని అర్థం చేసుకునే మార్గానికి నియోగి మిఖాముఖీ విదానం సహకరిస్తుంది.
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ విమర్షకులు
నియోగి అడిగిన వంద ప్రశ్నలు ఒక ప్రశ్న వంటిదే. ప్రతి ప్రశ్న వంద ప్రశ్నలవంటివే. ఈ ’ప్ర’, ’జ’ ఒక విలువైన డాక్యుమెంట్, ఒక పెద్ద జ్ఞానం. ఒకే రచయితను ఒకేసారి వంద ప్రశ్నలు అడగడం , ఆ రచయిత ఆ వంద ప్రశ్నలకు సమాదానాలు చెప్పడం, ఇది తెలుగు ముఖాముఖీ ప్రక్రియలో చరిత్ర.
కాత్యాయనీ విద్మహే, ప్రముఖ కవయిత్రి - విమర్శకులు
రచయితల గురించి, వారి రచనల గురించీ అందరికీ సమాచారం బాగా వ్యాప్తి చెందడం ముఖ్యం. ఆ లక్షంతో ఒక కొత్త మార్గానికి శ్రీకారం చుట్టాడు శ్రీ నియోగి. తాను ఎన్నుకున్న కవి పుస్తకాలన్నీ తాను ముందు చదివి వాటిలోంచి ప్రశ్నలు అడగడం, సమాధానాలు రాబట్టిన తర్వాత, ఆ ముఖాముఖీతోబాటు, తాను కూడా ఒక విస్తృత వ్యాసం, ఆ కవిని గురించి రాయడం, ఆ రెండూ కలిపి పుస్తకం వెయ్యడం, కవిని అర్థం చేసుకునే మార్గానికి నియోగి మిఖాముఖీ విదానం సహకరిస్తుంది.