జీవిత విశేషాలు
కీ.శే. ప్రభావతి మరియు కీ.శే. మహాకాళి వెంకటరావు దంపతులకు జన్మించారు రాజ్యశ్రీ.
విలువలతో కూడిన జీవితం, ఆత్మీయత, మమతానురాగాలు కలగలిపిన బాల్యాన్ని చవిచూశారు. సాహిత్యంలో, లలితకళల్లో విద్వాంసులైన ఇంట జన్మించి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.కామ్ పట్టభద్రురాలయ్యారు.
1977 నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రభుత్వ ఉప కార్యదర్శిగా 2011 లో ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందారు. ఒక నిర్దిష్ట, ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ జీవితంలోని వృత్తి, ప్రవృత్తులలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.
వీరి భర్త మాధవరావు, మెకానికల్ ఇంజనీర్. ప్రస్తుతం బ్యాంక్ చార్టర్డ్ వేల్యూయర్ గా సొంత ఆఫిస్ నిర్వహిస్తున్నారు.
అబ్బాయి ఫణీంద్ర (MS) USA, బిజినెస్ ఎనలిస్ట్ గా. Marylandలో ఉద్యోగం చేస్తున్నారు.
అమ్మాయి ప్రియాంక (MS)USA సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా న్యూజెర్సీ లో ఉద్యోగం చేస్తున్నారు.
తమ జీవితాన్ని జీవించడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా అవగాహన చేసుకుంటూ ప్రత్యేకంగా జీవించాలనే దృక్పథంతో సచివాలయంలోని ‘చేతన’ సాహితీ సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేస్తూ, మహిళలకు ఉపయోగకరంగా ఉండే పుస్తకాలను రచించారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు.
అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. కథలు, సామాజిక అంశాలపై వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనతో పాటు ఎన్నో కవితలను వ్రాసి సంకలనాలను వెలువరించారు.
వ్యక్తిత్వం :
దైవ భక్తి, గొప్ప భావుకత, మాట సూటి, భావం మేటి... ఎటువంటి భావాన్నైనా నిర్మొహమాటంగా చెప్పగలిగే తత్వ్తం తో మసులుకుంటూ వస్తున్న ఉన్నత వ్యక్తిత్వం రాజ్యశ్రీది.
అభిరుచులు:
ఎంతో విలక్షణ రచయిత్రిగా పేరు తెచ్చుకున్న రాజ్యశ్రీకి రచనా వ్యాసాంగంతో పాటు వీణావాదన, ఆధ్యాత్మిక ప్రవచనాలు, చెస్ ఆడటం, కవితా గోష్టి వంటి అనేక విభిన్న అభిరుచులు ఉన్నాయి.
రచనలు:
కేతవరపు రాజ్యశ్రీ గారు ఎలాంటి గందరగోళాలు లేకుండా సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో రచనలు చేయడంలో దిట్ట.
అక్షరాలను ఎంతో సరళంగా రచిస్తూ సాహిత్యంలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. జ్ఞానకాంక్షతో అక్షరాల వెంట దశాబ్దాల తరబడి నడుస్తున్నారు. కవిత్వం, వ్యాసాల రూపంలో వెలువడిస్తున్నారు.
స్వతహాగా ఆధ్యాత్మికురాలు కావడంతో ఎన్నో విలక్షణ ఆధ్యాత్మిక రచనలు చేశారు. పుస్తకాలను వెలువరించారు.
శ్రీ త్యాగరాయ గాన సభ సభలో వంశి వెకేషన్ వారి ఆధ్వర్యంలో "ఆధ్యాత్మిక ప్రవచనాల సప్తాహం" నిర్వహించారు.
“వ్యంజకాలు” అనే కొత్త ప్రక్రియలో “బొమ్మ-బొరుసు” అనే పుస్తకాన్ని రచించిన తొలి మహిళా రచయిత్రిగా పేరుతెచ్చుకున్నారు.
నూతన లఘు కవితా ప్రక్రియ "మెరుపులు" రూపశిల్పి:
ఫేస్ బుక్ లో "లఘు రూప కవితా వేదిక'' ద్వారా మెరుపులు అనే కొత్త లఘు రూప కవిత్వానికి శ్రీకారం చుట్టారు.
దీనికి రాజ్యశ్రీ రూపొందించిన నిబంధనలు:
" మెరుపులు"
లఘు రూప కవితలు
నిబంధనలు:
ఏదైనా ఒక సామాజిక అంశం మీద నాలుగు నుంచి ఎనిమిది లైన్ల లోపల కవిత ఉండాలి.
1. దీనిలో 4 నుంచి 8 పాదాలు ఉంటాయి
2. కవితలో వర్తమాన సామాజిక స్థితి , గతి , భవిష్యత్తు , ప్రధానంగా వుంటాయి.
3. కవితలో జీవితంలో తారసపడే సంఘటనలను, రాగ ద్వేషాలును, యధాతథంగా, నర్మగర్భంగా , హాస్యయుతంగా , అన్నిరసాలను పొందు పరచవచ్చు.
4. నిర్మాణంలో కానీ రచనలో కానీ కవికి పూర్తి స్వేచ్ఛ వుంటుంది.
5. ప్రతి కవిత ఒక ముక్తకమే!
6. ప్రతి కవిత దేనికదే!
7. మరో కవిత వేరే విషయ ప్రధానంగా వుంటుంది.
8. కవితలో పాదాల కూర్పు వాక్యంలా కాకుండా సంక్షిప్త పదాలుగా వుంటాయి.
సాహితీ కృషికి గుర్తింపు :
ఈమె ప్రతిభకు గౌరవ‘“డాక్టరేట్”, “ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు”, “భారత్ భాషా భూషణ్", "అక్కినేని స్వర్ణ కంకణ పురస్కారం", "భాషా సేవా పురస్కారం", "ఉత్తమ మాతృమూర్తి పురస్కారం", “ప్రజ్ఞాశ్రీ”, “మధర్ థెరిస్సా అవార్దు”, “స్త్రీ శక్తి పురస్కారం”, “వేదాంత వక్త”," సేవారత్న", వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే "ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ పురస్కారం", సృజన సాహితీ సమాఖ్య సత్తుపల్లి ఖమ్మం జిల్లా వారిచే జీవిత సాఫల్య పురస్కారం., "శ్రీ శ్రీ ఎక్సలెన్సీ అవార్డు.. వంటి ఎన్నో పురస్కారాలను లభించాయి. గౌరవ “ఉగాది” సత్కారాలను అందుకున్నారు. యువకళావాహిని వారిచే "స్వర్ణ కంకణ పురస్కారం", లఘురూప కవితా వేదిక వారిచే ‘వెన్నెల పక్షులు’ రచనకు గాను"ఉత్తమ గ్రంథం పురస్కారం " అందుకున్నారు. యోగ వేదాంత విజ్ఞాన అకాడమీ, (శ్రీ కృష్ణ యూనివర్స్ అన్లిమిటెడ్ సొసైటీ వారిచే"వేదాంత వక్త "బిరుదు పొందారు.
కేతవరపు రాజశ్రీ నిర్వహిస్తున్న పలు బాధ్యతలు:
- సంఘమిత్ర లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షురాలు.
- సాహితీ కార్యక్రమాలు కవి సమ్మేళనాలలో, పర్యావరణ పరిరక్షణ సదస్సులు నిర్వహణ
- టి.వి. మరియు రేడియోల్లో మహిళలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొని తమ వాణిని సమర్ధవంతంగా వినిపిస్తున్నారు.
- త్యాగరాయ గాగసభలో జీవిత సభ్యత్వం
- అశోక్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ జీవిత సభ్యత్వం
- ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఛాప్టర్ లో జీవిత సభ్యత్వం.

రాజ్యశ్రీ తాతగారు "విద్వాన్ మహాకాళి"

రాజ్యశ్రీ తండ్రి "మహాకాళి వెంకట్రావు

శ్రీమతి కేతవరపు రాజ్యశ్రీ
భర్త మాధవరావు, పిల్లలు ఫణీంద్ర, ప్రియాంకలతో రాజ్యశ్రీ
కొడుకు, కొడలు, కూతురు ఆల్లుడు, మనవడితో రాజ్యశ్రీ
కుటుంబ సభ్యులతో...
తోటికోడళ్ళతో రాజ్యశ్రీ...