నా లండన్ యాత్ర


2014 సెప్టెంబర్ 27, 28 వ తేదీలలో వంగూరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ వారు సంయుక్తంగా లండన్ లో నిర్వహంచిన నాల్గవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు రాజ్యశ్రీ ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.

 

ఎంతో మంది ప్రముఖ సాహితీవేత్తల మధ్యలో ఏకైక మహిళా సాహిత్తీవేత్తగా ఆమెకు అద్భుతమైన, అపూర్వమైన అవకాశం కలిగింది.

 

ఆ సదస్సులో ఆమె తన తల్లిదండ్రులకు నమస్సులు తెలియజేసిన తరువాత తెలుగు సాహిత్యానికి ఆదికవి నన్నయ దగ్గర నుంచి, తిక్కన, తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ గారి తెలుగు కవిత్వం గురించి మాట్లాడారు.

 

గిడుగు రామ్మూర్తి పంతులు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీశ్రీ వర్ధమాన కవులను ప్రోత్సహించిన విధానం, వారి కవిత్వాల గురించి ప్రసంగించారు.


కవిత్వం, వాడుక భాషలోకి మారిన తీరు - సామాన్యులు సైతం రాస్తున్న వర్తమాన పరిస్థితుల గురించి చక్కటి ఉపన్యాసం ఇచ్చారు.

 

కవిత్వంలో వస్తున్న నూతన పోకడలు - నాలుగు పాదాలు, నానీలు, రెక్కలు, వ్యంజకాలు, ముక్తకాల గురించి వివరించారు.

 

అలాగే తెలుగు భాష గొప్పదనం గురించి ప్రసంగించారు. ఈ సభల్లోనే డా|| కేతవరపు రాజ్యశ్రీ రచించిన “రెక్కల్లో గీతామృతం” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 

తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లో కూడా ‘గీతామృతం” పుస్తకం విడుదలయ్యింది.

 

లండన్ పార్లమెంట్ లో అక్కడ పార్లమెంటేరియన్ లుంబా గారి కార్యాలయంలో హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు డాన్ బైల్స్ గారిచే రాజ్యశ్రీ కి అపూర్వ సత్కారం జరిగింది.

 

లండన్ లో జరిగిన తెలుగు సభలు విజయవంతంగా పూర్తి చేయడానికి వంగూరి చిట్టెన్ రాజు, కిల్లి సత్యప్రసాద్ వారి సతీమణి డా|| పద్మ తదితరులు అపూర్వమైన సహకారం అందించారు.

 

యాత్ర విజయవంతమైన తర్వాత తమ యాత్రానుభవాలను “నా లండన యాత్ర” పేరుతో పుస్తకంగా విడుదల చేసి వంగూరి చిట్టెన్ రాజు కు అంకితమిచ్చారు. హైదరాబాద్ లో డా||కె.వి. రమణాచారి, తెలంగాణా ప్రభుత్వ సలహాదారు వారిచే విడుదలచేయబడింది.

 

ఈ పుస్తకాన్ని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా పూర్తిగా ఉచితంగా చదువుకోవచ్చు.